డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ విచారణకు ఇటీవలే హాజరైన నటి దీపికా పదుకొణె.. గోవాలో జరుగుతున్న చిత్రీకరణలో తిరిగి పాల్గొంది. శకున్ బత్రా దర్శకత్వం వహిస్తున్న సినిమా సెట్స్‌లో అడుగుపెట్టింది. ఈమెతో పాటు యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిలేషన్షిప్ నేపథ్య కథతో దీనిని రూపొందిస్తున్నారు.
ఇదీ జరిగింది
శకున్ బత్రా తీస్తున్న సినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంది. సెప్టెంబరులో దీపిక చిత్రీకరణలో పాల్గొంది. ఆ సమయంలోనే సుశాంత్ మృతితో సంబంధముందనే ఆరోపణలతో, డ్రగ్స్ కేసులో భాగంగా పలువురు స్టార్స్ విచారించింది ఎన్సీబీ. ఈ క్రమంలోనే దీపికకు సమన్లు జారీ చేసింది. దీంతో గోవాలో ఉన్న ఆమె.. షూటింగ్ మధ్యలోనే ఆపేసి, ముంబయికి వచ్చి విచారణకు హాజరైంది.
ఈ ఏడాది పారంభంలో 'ఛపాక్' చిత్రంలో విభిన్న పాత్రతో అలరించింది దీపిక. భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి '83'లో నటిస్తోంది. నాగ్ అశ్విన్- ప్రభాస్ సినిమాలోనూ హీరోయిన్గా ఎంపికైంది.
ఇదీ చూడండి 'కొలవెరి' మ్యూజికల్ మ్యాజిక్.. ఓ సంచలనం