తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పెళ్లికి ముందే సహజీవనమా.. నాకు నచ్చదు' - ranveer singh WIFE

పెళ్లికి ముందే సహజీవనం చేయడమనే పద్ధతి తనకు నచ్చలేదని చెప్పింది బాలీవుడ్​ హీరోయిన్ దీపికా పదుకొణె. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

రణ్​వీర్ సింగ్-దీపికా పదుకొణె

By

Published : Oct 17, 2019, 6:31 AM IST

ముందే సహజీవనం చేస్తే.. పెళ్లి తర్వాత ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ఏం ఉండదని అభిప్రాయపడుతోంది హీరోయిన్ దీపికా పదుకొణె. 2013లో 'రామ్‌లీలా' షూటింగ్​లో నటుడు రణ్​వీర్ సింగ్​తో ప్రేమలో పడ్డ ఈ భామ... అతడిని గతేడాది వివాహం చేసుకుంది. అయితే నేటి తరంలో కొందరిలా పెళ్లికి ముందు వీరిద్దరూ కలిసి జీవించలేదు. ఓ సందర్భంలో ఈ విషయాన్ని స్వయంగా దీపికనే చెప్పింది. ఇందుకు ఓ కారణముందని ఇటీవలే ఇంటర్వ్యూలో వివరించింది.

రణ్​వీర్ సింగ్-దీపికా పదుకొణె

'ప్రేమలోపడ్డ వెంటనే సహజీవనం చేస్తే.. తర్వాత ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ఏం ఉంటుంది? ఇష్టపడ్డ వారి గురించి పెళ్లికి ముందే తెలుసుకోవాలని ఇలా చేస్తుంటారు. కానీ ఆ పద్ధతి నాకు నచ్చలేదు. మేమిద్దరం సరైన నిర్ణయం తీసుకున్నామనే అనుకుంటున్నాం. వివాహం అంటే నచ్చని వారు చాలా మంది ఉన్నారు. మేం అలాంటి వ్యక్తులం కాదు. ఈ వివాహ వ్యవస్థపై మాకు నమ్మకముంది. ప్రస్తుతం భార్యాభర్తలుగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం' -దీపికా పదుకొణె, హీరోయిన్

ప్రస్తుతం 'ఛపాక్‌'లో నటిస్తూ బిజీగా ఉంది దీపికా. యాసిడ్‌దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేఘనా గుల్జార్‌ దర్శకురాలు. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. దీనితో పాటే '83' సినిమాలోనూ హీరోయిన్​గా నటిస్తోంది.

ఇది చదవండి: 'మన సినిమాలూ హాలీవుడ్​లో డబ్​ కావాలి'

ABOUT THE AUTHOR

...view details