తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Deepika Padukone: అయినా ముద్దు సీన్లకు... వయసుతో పనేంటి?: దీపిక - దీపిక

Deepika Padukone: 'గెహ్రాహియా' సినిమాలో బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె బోల్డ్​ సీన్స్​లో నటించడం హాట్​ టాపిక్​గా మారింది. ఈ విషయం స్పందించిన ఆమె.. ఇంటిమేట్‌ సీన్స్‌ అనేవి కథలో భాగంగానే చేసినట్లు తెలిపారు. అయితే ముద్దు సీన్లను చూపించి ప్రేక్షకులను ఎగ్జైట్‌ చేసి మూవీ చూసేలా చేయాలన్న ఉద్దేశంతో తీయలేదని చెప్పారు.

Deepika Padukone
దీపికా పదుకొణె

By

Published : Jan 27, 2022, 10:18 PM IST

Deepika Padukone: బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దీపికా పదుకొణె. ప్రస్తుతం ఆమె అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో విడుదల కాబోయే 'గెహ్రాహియా' ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఫిబ్రవరి 11న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్ర కథలో భాగంగా దీపిక- సిద్ధాంత్‌ ముద్దు సీన్లు, బోల్డ్‌గా కనిపించాల్సి వచ్చింది. ఇదే విషయంపై ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్డ్‌ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడింది దీపిక.

దీపికా పదుకొణె

"'గెహ్రాహియా'లో సిద్ధాంత్‌ చతుర్వేదితో కలిసి ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించాను. అయితే ముద్దు సీన్లను చూపించి ప్రేక్షకులను ఎగ్జైట్‌ చేసి మూవీ చూసేలా చేయాలన్న ఉద్దేశంతో తీయలేదు. కథంతా మోడ్రన్‌ డే రిలేషన్‌షిప్స్‌తో ముడిపడి ఉంటుంది. ప్రేమలో ఉన్న ఇద్దరూ చివరికి మోసపోతారు. దాని కన్నా ముందు వారి ప్రేమ ప్రయాణంలో వచ్చినవే ఆ సీన్స్‌"

-దీపికా పదుకొణె, నటి

అది నా వ్యక్తిగత అభిప్రాయం..

సిద్ధాంత్‌ చతుర్వేది, దీపిక

"ఇంటిమేట్‌ సీన్స్‌ అనేవి కథలో భాగంగానే చేస్తాం. అవి కేవలం ఒక వయసు వారు లేదా ఒక జెండర్‌కే పరిమితమని ఆపాదిస్తే నేను అంగీకరించను. కాబట్టి కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు నేను అంగీకరిస్తా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదే అంశంపై యువ దర్శకులు, మహిళా దర్శకులను అడిగితే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దీనిపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది"

శకున్‌ వల్లే 'గెహ్రాహియా' ఒప్పుకున్నా

షూటింగ్​లో దీపికా

ఏ దర్శకుడైనా తన స్క్రిప్ట్‌ వినిపించగానే.. అందులో నేను మొదట చూసేది అది.. 'సౌకర్యం', 'నమ్మకం'. దర్శకుడు శకున్‌ బత్రా 'గెహ్రాహియా'లోని నా పాత్ర అలిషా గురించి చెప్పగానే.. ఆ రెండూ ఉన్నాయని అనిపించాయి. ఒక విషయం అయితే వంద శాతం చెబుతా. శకున్‌ బత్రా లాంటి వ్యక్తి ఈ సినిమా చేయకపోయుంటే నేను ఓకే చెప్పేదాన్ని కాదు. ఇంటిమేట్‌ సీన్స్‌ విషయంలో నన్ను ఇలానే నటించు అని చెప్పుంటే.. వెంటనే నో చెప్పేసేదాన్ని. సినిమాకి అవసరమైన సన్నివేశాలను కంఫర్ట్‌ ఇచ్చే చిత్రీకరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:అందుకు నన్ను క్షమించండి: అనసూయ

ABOUT THE AUTHOR

...view details