బాలీవుడ్లో తెరకెక్కుతున్న బయోపిక్ 'ఛపాక్'ను తొలి నుంచి గమనిస్తున్న వారికి ఇప్పటికీ ఓ సందేహం అలానే ఉండిపోయింది. ఈ సినిమాకు మూలమైన యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ ఎక్కడా? అని. వాటికి తెరదించుతూ ఆమె ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముంబయిలో శుక్రవారం జరిగిన 'ఛపాక్' టైటిల్ ట్రాక్ ఆవిష్కరణలో సందడి చేశారు లక్ష్మి. అయితే ఈ పాటను వేదికపై శంకర్ మహదేవన్ పాడుతుండగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. పక్కనే ఉన్న దీపిక.. లక్ష్మిని ఓదార్చారు.