తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండితెరపై దంపతులుగా దీపికా, రణ్​వీర్​ - బాలీవుడ్

బాలీవుడ్​ హాట్​ జంట దీపికా పదుకొణె, రణ్​వీర్​ సింగ్​ '83' చిత్రంలో కలిసి నటించనున్నారు. 83 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భార్యభర్తలుగా నటించనున్నారు ఈ నిజజీవిత దంపతులు.

వెండితెరపై దంపతులుగా దీపికా, రణ్​వీర్​

By

Published : Jun 12, 2019, 1:01 PM IST

క్రీడల నేపథ్యంలో తెరకెక్కబోతున్న '83' చిత్రంలో బాలీవుడ్ హాట్​ జంట కలిసి నటించనున్నారు. ​1983 ప్రపంచ కప్​ గెలుచుకున్న నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. క్రికెట్​ దిగ్గజం కపిల్​ దేవ్​ పాత్రలో రణ్​వీర్​, ఆయన భార్య రోమి దేవ్​గా దీపికా వెండితెరపై కనువిందు చేయనున్నారు. సామాజిక మాధ్యమాల్లో రణ్​వీర్ ఈ విషయాన్ని​ ప్రకటించాడు.

"83 బృందంలో నాతో పాటు దీపిక జత కలిసింది. ఈ చిత్రాన్ని కబీర్​ ఖాన్​ తెరకెక్కిస్తున్నాడు."

-రణ్​వీర్​ సింగ్

మరో పోస్ట్​లో మరిన్ని విషయాలు పంచుకున్నాడు రణ్​వీర్​.

"నా భార్య పాత్రలో నా భార్య తప్ప ఇంకెవరు బాగా చేయగలరు? 83 చిత్రంలో రోమి దేవ్​గా దీపికనే నటిస్తోంది. కబీర్​ ఖాన్​ది తెలివైన ఎంపిక."

-రణ్​వీర్​ సింగ్

ఇప్పటివరకు ఈ జంట మూడు చిత్రాల్లో నటించింది. చివరిసారిగా గతేడాది విడుదలైన పద్మావత్​లో వెండితెరపై మెరిశారు. ప్రస్తుతం ఈ చిత్రం స్కాట్​లాండ్​లోని గ్లాస్​గోలో తెరకెక్కుతోంది.

1983 ప్రపంచ కప్​ ఫైనల్​లో కపిల్​ సారథ్యంలో వెస్టిండీస్​పై అద్భుత విజయాన్ని సాధించింది భారత జట్టు. మొదటిసారిగా భారత్​కు ప్రపంచకప్​ను అందించింది. ఈ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 2020 ఏప్రిల్​ 10న విడుదల కాబోతుంది. ఈ చిత్రం రిలయన్స్​ ఎంటర్​టైన్​మెంట్​ సమర్పణలో మధు మంతెన, విష్ణు ఇందూరి, కబీర్​ నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details