ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా కథానాయిక ఎవరనేది తెలిసిపోయింది. ఎన్నో రోజులుగా ఉన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె డార్లింగ్ సరసన నటించనునట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
'ప్రభాస్ 21' నుంచి సర్ప్రైజ్ వచ్చేసిందోచ్.. - డార్లింగ్‌కు జోడిగా దీపికా పదుకొణె
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఈరోజు స్పష్టం చేసింది.
డార్లింగ్ సరసన దీపికా పదుకొణె
ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్'లో నటిస్తున్నాడు ప్రభాస్. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇది చూడండి : 'సల్మాన్ సినిమాకు నో చెప్పినందుకు బెదిరించారు'
Last Updated : Jul 19, 2020, 11:55 AM IST