Michael movie: తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్.. మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'మైఖేల్'లో కీలకపాత్ర కోసం ఎంపికైంది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ చౌదరి-పుస్కూర్ రామ్మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
GEHRAIYAAN TRAILER: రొమాంటిక్ కథతో తీసిన బాలీవుడ్ సినిమా 'గహ్రాయియాం' ట్రైలర్ గురువారం రిలీజైంది. దీపికా పదుకొణె, అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటించారు.