తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బోల్డ్​ సీన్స్​పై ట్రోల్స్​.. నెటిజన్లపై దీపిక ఫైర్!​ - బాలీవుడ్​ వార్తలు తాజా

Deepika Padukone Gehraiyaan: బోల్డ్​ సీన్స్​లో నటించడంపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించింది బాలీవుడ్​ స్టార్​ నటి దీపిక పదుకొణె. ఆ చిత్రాల్లో నటించేందుకు తన భర్త రణ్​వీర్​ సింగ్​ అనుమతి తీసుకున్నారా లేదా అంటూ ప్రశ్నించడం స్టుపిడ్​గా ఉందంటూ మండిపడింది.

Deepika Padukone
దీపిక పదుకొణె

By

Published : Feb 9, 2022, 6:43 PM IST

Deepika Padukone Gehraiyaan: బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె తొలిసారి పూర్తిస్థాయి రొమాంటిక్‌, బోల్డ్‌ కంటెంట్‌ చిత్రం 'గెహ్రాహియా'తో పలకరించనుంది. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది ఈ చిత్రం ఈనెల 11న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. విడుదల తేదీ దగ్గర పడటం వల్ల ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది దీపిక. కాగా ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూలో.. " 'గెహ్రాహియా'లో బోల్డ్‌ సీన్స్‌లో నటించడానికి మీ భర్త రణ్‌వీర్‌ సింగ్‌ అనుమతి తీసుకున్నారా" అని ప్రశ్నించగా.. దీపిక మాట్లాడుతూ.. "ఈ సినిమా కథంతా మోడ్రన్‌ డే రిలేషన్‌షిప్స్‌తో ముడిపడి ఉంటుంది. కాబట్టే అలా నటించాల్సి వచ్చింది. బోల్డ్‌ సీన్స్‌లో నటించేందుకు నా భర్త అనుమతి తీసుకున్ననా లేదా దానికి ఆయన ఎలా స్పందించారు అని అడగటం స్టుపిడ్‌గా ఉంది. ముఖ్యమైన విషయమేమిటంటే.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కామెంట్స్‌ను మేము అసలు చదవం. రణవీర్‌ కూడా అంతే" అని ఘాటుగా బదులిచ్చింది.

'గెహ్రాహియా'లో ఓ సన్నివేశం

'గెహ్రాహియా'లో తన భార్య దీపిక నటన చూసి గర్వంగా ఫీల్‌ అవుతున్నా అంటూ ఇటీవలే రణ్‌వీర్‌ చెప్పుకొచ్చాడు. ట్రైలర్‌ను షేర్‌ చేసి దీపిక నటనకు ప్రశంసలు కురిపించాడు. దీపికా పదుకొణె- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించారు. కేవలం ఓటీటీ కోసమే ఈ చిత్రాన్ని దర్శకుడు షకున్‌ బత్రా మిత్‌ రాయ్‌ కథ అందించగా కరణ్‌ జోహర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మా ప్రొడక్షన్స్‌ హౌస్‌ నిర్మిస్తోంది. నసీరుద్దీన్‌ షా, రాజాత్‌ కపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇదీ చూడండి :కాజల్​పై బాడీ షేమింగ్ కామెంట్స్​.. నెటిజన్లపై బ్యూటీ ఫైర్​

ABOUT THE AUTHOR

...view details