బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్(Ranveer Singh couple).. టోక్యో ఒలింపిక్ పతక విజేత, స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును కలిశారు. ఆ ముగ్గురు కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ముంబయిలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ ట్రీట్‌కు వెళ్లి అక్కడ సందడి చేశారు. ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ.. వయ్యారాలు ఒలకబోశారు. డిన్నర్ ట్రీట్‌లో దీపిక, సింధు ధరించిన తెలుపు దుస్తులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
సింధును కలిసిన దీపిక, రణ్వీర్.. రెస్టారెంట్లో సందడి! - పీవీ సింధు
బాలీవుడ్ స్టార్ జోడీ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్(Ranveer Singh couple)తో కలిసి ముంబయిలో సందడి చేసింది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(PV Sindhu). వీరు డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.
![సింధును కలిసిన దీపిక, రణ్వీర్.. రెస్టారెంట్లో సందడి! Deepika Padukone and Ranveer Singh Meet PV Sindhu For Dinner](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13039947-thumbnail-3x2-ramu.jpg)
సింధును కలిసిన దీపిక, రణ్వీర్.. రెస్టారెంట్లో సందడి
రణ్వీర్, దీపిక నటించిన '83' (Ranveer Singh 83 release date)చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమ్ఇండియా.. ప్రపంచ కప్ సాధించిన నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కపిల్ దేవ్ భార్య రోమి దేవి పాత్రలో దీపిక కనిపించనుంది.
ఇదీ చూడండి:రణ్వీర్ సింగ్ '83' విడుదల తేదీ ఫిక్స్
Last Updated : Sep 12, 2021, 12:08 PM IST