Deepika paukone Ananya pandye movie: కరోనా పరిస్థితుల తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లు గాడిలో పడుతున్నాయి. అదే సమయంలో ఓటీటీలోనూ సినిమాలు ఎక్కువగానే విడుదలవుతున్నాయి. ఎక్కువశాతం భారీ చిత్రాలు థియేటర్ల వైపే మొగ్గు చూపుతున్నాయి. కానీ దీపికా పదుకొణె, అనన్యా పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఓ భారీ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందని తెలిసింది. షకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారట.
ఓటీటీలో దీపిక-అనన్య సినిమా.. బోల్డ్ సీన్సే కారణం! - deepika padukone ananya pandey
Deepika paukone Ananya pandye movie: షకున్ బత్రా దర్శకత్వంలో దీపికా పదుకొణె, అనన్యా పాండే కలిసి నటించిన సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బోల్డ్ సీన్స్ మోతాదు కాస్త ఎక్కువగా ఉండటమే కారణమట!
ఈ మూవీలో శృంగార సన్నివేశాల మోతాదు కాస్త ఎక్కువగానే ఉందని సమాచారం. దీంతో సెన్సార్‌బోర్డు నుంచి ఎక్కువ కట్స్ వచ్చే అవకాశం ఉండేలా ఉందట. అదే జరిగితే సినిమా బాగా దెబ్బతినే అవకాశాలున్నాయి. దీంతో చిత్రబృందం ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధాల నేపథ్యంగా నడిచే కథని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేసినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: పూజాహెగ్డే క్యూట్ స్మైల్.. గరం పోజులతో శ్యామా, కేట్ శర్మ