తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రకుల్, దీపిక.. వరుస రోజుల్లో ఎన్​సీబీ విచారణకు

వరుసగా శుక్ర, శనివారాల్లో రకుల్ ప్రీత్, దీపికా పదుకొణె.. ఎన్​సీబీ విచారణకు హాజరు కానున్నారు.

Deepika Padukone acknowledges summons, to face NCB on Friday
దీపిక-సారి- రకుల్

By

Published : Sep 24, 2020, 9:11 PM IST

డ్రగ్స్‌ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. మాదక ద్రవ్యాల కేసులో స్టార్ హీరోయిన్‌లు దీపికా పదుకొణె, రకుల్‌ ప్రీత్‌, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌కు సమన్లు జారీ చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ.... ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోన్‌ ఖంబాటాను గురువారం ఐదు గంటల పాటు విచారించింది. సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీ విచారణకు హాజరయ్యారు. సమన్లు అందినట్లు రకుల్‌ ధ్రువీకరించారని, త్వరలోనే విచారణకు హాజరవుతారని ఎన్​సీబీ వెల్లడించింది.

డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం నటి రకుల్‌.. గురువారం ఎన్​సీబీ ఎదుట హాజరు కావాలి. తమకు ఎలాంటి సమన్లు అందలేదని, అందువల్లే రకుల్‌ విచారణకు హాజరు కావడం లేదని తెలియచేస్తూ, ఆమె లీగల్‌ బందం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆ తర్వాత కొంతసేపటికే సమన్లు అందాయని, శుక్రవారం విచారణకు హాజరవుతున్నానని నటి ప్రకటించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. రకుల్‌ను ఫోన్‌ సహా వివిధ ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా సంప్రదించడానికి యత్నించినట్లు ఎన్​సీబీ తెలిపింది. సమన్లు అందినట్లు ఆమె తెలిపిందని, త్వరలో విచారణకు హాజరవుతారని అధికారులు వెల్లడించారు.

సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు గత కొన్నిరోజుల నుంచి డ్రగ్స్‌ కోణంలో విచారణ చేస్తున్నారు. సుశాంత్ ప్రేయసి రియాను ఎన్​సీబీ, సీబీఐ, ఈడీ అధికారులు కొన్నిరోజుల క్రితం సుధీర్ఘ విచారణ చేసి అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

అక్టోబర్‌ 6 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆమె.. బాలీవుడ్​లో డ్రగ్స్‌ వినియోగించే పలువురు నటీనటుల పేర్లు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా వాట్సాప్‌ సందేశాలు వెలుగులోకి రావడం వల్ల అధికారులు.. దీపికా పదుకొణె, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్లకు సమన్లు జారీ చేశారు.

మాదక ద్రవ్యాల అంశంలో ఇప్పటివరకు ఎన్​సీబీ రెండు కేసులను నమోదు చేసింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్‌ కోణంలో ఒక కేసు నమోదవగా.. బాలీవుడ్‌కు మాదక ద్రవ్యాలకు ఉన్న సంబంధాలపై మరో కేసు నమోదైంది. ఈ రెండింటికి దగ్గరి సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు దీపికా పదుకొణె శుక్రవారం, శ్రద్ధాకపూర్ శనివారం విచారణకు హాజరుకానున్నారు.

ABOUT THE AUTHOR

...view details