తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ, ఎన్టీఆర్​తో కలిసి నటించాలని ఉంది: దీపిక - దీపికా పదుకొణె ఎన్టీఆర్​

Deepika Padukone, NTR, AlluArjun: టాలీవుడ్​ స్టార్​ హీరోలు అల్లుఅర్జున్​, ఎన్టీఆర్​తో కలిసి సినిమా చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె. ఎన్టీఆర్​ వ్యక్తిత్వం తనను బాగా ఆకట్టుకుందని తెలిపింది.

Deepika Padukone about NTR, AlluArjun
దీపికా పదుకొణె

By

Published : Feb 11, 2022, 5:45 AM IST

Deepika Padukone, NTR, AlluArjun: టాలీవుడ్​ స్టార్​ హీరోలు అల్లుఅర్జున్​, ఎన్టీఆర్​తో కలిసి సినిమా చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె. ఎన్టీఆర్​ వ్యక్తిత్వం తనను ఆకట్టుకుందని తెలిపింది.

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె గెహ్రాహియా చిత్రంతో ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ భామ తన మనసులోని ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. అల్లుఅర్జున్​, ఎన్టీఆర్​తో కలిసి నటించాలని ఉన్నట్లు తెలిపింది. తారక్​ వ్యక్తిత్వం, నటన తననెంతో ఆకట్టుకున్నాయని చెప్పింది. ఇప్పటికే ప్రభాస్​తో కలిసి 'ప్రాజెక్ట్​ కె' సినిమాలోనూ దీపిక నటిస్తోంది.

కాగా, బాలీవుడ్​ హీరోయిన్స్​ టాలీవుడ్​ సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మన హీరోలతో కలిసి స్క్రీన్​ షేర్​ చేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే ఆలియా భట్​, దీపికా పదుకొణె, అనన్య పాండే మన హీరోలతో కలిసి పాన్​ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.

బన్నీతో నటించాలని ఉంది

అల్లుఅర్జున్​తో కలిసి సినిమా ఎప్పుడు చేస్తావని తన ఇంట్లో వారు అడుగుతున్నారని ఇటీవల ఆలియా చెప్పింది! బన్నీతో కలిసి నటించాలని ఉందని పేర్కొంది. ఇప్పటికే 'ఆర్​ఆర్​ఆర్'​లో ఎన్టీఆర్​తో కలిసి నటించిన ఆలియా.. ఆయనతో కలిసి మరో మూవీ చేయనుంది. దీనికి త్రివిక్రమ్​ దర్శకత్వం వహించనున్నారు.

ఇదీ చూడండి: బోల్డ్​ సీన్స్​పై ట్రోల్స్​.. నెటిజన్లపై దీపిక ఫైర్!​

ABOUT THE AUTHOR

...view details