తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వెంకీమామ' దీపావళి కానుక అదిరింది..! - వెంకీమామ సినిమా

దీపావళి సందర్భంగా 'వెంకీమామ' కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. ఈ సినిమాలో రైస్​ మిల్ యజమానిగా వెంకటేశ్, ఆర్మీ అధికారిగా నాగచైతన్య కనిపించనున్నారు.

నాగచైతన్య-వెంకటేశ్

By

Published : Oct 26, 2019, 4:31 PM IST

టాలీవుడ్​ అగ్రహీరో విక్టరీ వెంకటేశ్.. యువ కథానాయకుడు నాగచైతన్యతో 'వెంకీమామ'లో కలిసి నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఇప్పటికే విడుదలైన ఫొటోలు, వీడియోలు ఆసక్తి రేపుతున్నాయి. అయితే దీపావళి సందర్భంగా ఇద్దరి హీరోలు కలిసున్న కొత్త లుక్​ విడుదలైంది.

'వెంకీమామ' దీపావళి కానుక

ఇందులో ఓవైపు వెంకీ ఉండగా, మరోవైపు ఆర్మీ దుస్తుల్లో ఉన్నాడు అక్కినేని హీరో. హీరోయిన్లుగా పాయల్ రాజ్​పుత్, రాశీఖన్నా నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. కె.ఎస్.రవీందర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్​ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై.. సురేశ్​బాబు-విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: జాతరలో వెంకీమామ యాక్షన్ పాఠాలు...!

ABOUT THE AUTHOR

...view details