దీపావళిని మరింత వెలుగుల మయం చేసేందుకు సిద్ధమయ్యారు టాలీవుడ్ హీరోలు. శనివారం కొన్ని సినిమాల పోస్టర్లు విడుదలయ్యాయి. ఆ జోష్‌ను మరింత పెంచేందుకు ఆదివారం.. మరిన్ని సరికొత్త లుక్‌లు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిని చూసేయండి.
మహేశ్ నవ్వుకు మరో భామ ఫిదా
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. మహేశ్ నవ్వుతూ ఉండగా, ఆ దిగువన నవ్వుులు చిందిస్తున్నా హీరోయిన్ రష్మిక ఫొటో అలరిస్తోంది. వచ్చే సంక్రాంతికి రానుందీ చిత్రం.
సరిలేరు నీకెవ్వరు.. దీపావళి పోస్టర్ 'రూలర్'లో మాస్‌గా బాలకృష్ణ
నటసింహం బాలకృష్ణ కొత్త సినిమాకు 'రూలర్' అనే టైటిల్ నిర్ణయిస్తూ శనివారం ఓ ఫొటో పంచుకుంది చిత్రబృందం. అలాంటిదే మరోలుక్ను ఆదివారం విడుదల చేసింది. అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. డిసెంబరు 20న రానుందీ చిత్రం.
రూలర్లో ధర్మ అనే పోలీస్ అధికారిగా బాలకృష్ణ బన్నీ.. దీపావళి సర్ప్రైజ్
'అల వైకుంఠపురములో' చిత్రం నుంచి 'రాములో రాములా' పాటను శనివారం విడుదల చేసిన చిత్రబృందం.. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
'అల వైకుంఠపురములో' సినిమా దీపావళి పోస్టర్ వర్షంలో పక్కన భామతో
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'డిస్కోరాజా' నుంచి కొత్త లుక్ విడుదలైంది. వర్షంలో గొడుగు పట్టుకుని నడుస్తున్న రవితేజ, నభానటేశ్ ఫొటో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే వచ్చిన పాటలు, లుక్స్ అలరిస్తున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
డిస్కోరాజాలో రవితేజ-నభా నటేశ్ పిల్లాడి చేయిపట్టుకున్న నాగశౌర్య
'అశ్వథ్థామ' అంటూ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు హీరో నాగశౌర్య. దీపావళి సందర్భంగా తన కొత్త సినిమా లుక్‌ను విడుదల చేశాడు. చిన్నపిల్లాడి చేయిపట్టుకున్న ఫొటో చిత్రంపై ఆసక్తి రేపుతోంది.
నాగశౌర్య కొత్త చిత్రం అశ్వథ్థామ దీపావళి లుక్ ఇది చదవండి: 'సిద్' గాత్రానికి మనసులు పులకరిస్తాయ్