మేఘా ఆకాశ్ హీరోయిన్గా 'డియర్ మేఘ' అనే చిత్రం తెరకెక్కుతోంది. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కన్నీరు కారుస్తూ ఉన్న ఈ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.
'శేఖర్'గా రాజశేఖర్, ఫస్ట్‌లుక్‌తో మేఘ - డియర్ మేఘ ఫస్ట్ లుక్
కథానాయకుడు రాజశేఖర్ హీరోగా కొత్త చిత్రం ప్రకటన వచ్చింది. అలాగే మేఘా ఆకాశ్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న 'డియర్ మేఘ' ఫస్ట్‌లుక్ విడుదలైంది.
'శేఖర్'గా రాజశేఖర్, ఫస్ట్‌లుక్‌తో మేఘ
కథానాయకుడు రాజశేఖర్ రంగంలోకి దిగబోతున్నారు. ఆయన కొత్త చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. మలయాళంలో విజయవంతమైన 'జోసెఫ్' రీమేక్‌లో రాజశేఖర్ నటించబోతున్నారు. తెలుగులో 'శేఖర్' అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం.