విజయ్ దేవరకొండ సినిమాలో సిద్ శ్రీరామ్ పాటుందంటే సంగీత ప్రియులకు పండగే పండగ. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే', 'మాటే వినదుగా' ఎంత హిట్ అయ్యాయో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో పాటతో అలరించేందుకు సిద్ధమైందీ కాంబో. 'డియర్ కామ్రేడ్'లోని 'కడలల్లే వేచె కనులే..' అంటూ సాగే ఈ గీతం అభిమానుల్ని అలరిస్తోంది.
కడలల్లే వేచె కనులే... కదిలేను నదిలా కలలే... - sid sriram
విజయ్-రష్మిక జంటగా నటించిన 'డియర్ కామ్రేడ్'లోని మరోపాట విడుదలైంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ గీతం సంగీతప్రియుల్ని ఆకట్టుకుంటోంది. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
కడలల్లే వేచే కనులే... కదిలేను నదిలా కలలే...
రష్మిక మందణ్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు. జులై 26న దక్షిణాదిలో నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.