క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపిక చేసింది. భారత్‌లోని వివిధ భాషలకు చెందిన మరో 28 చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటన్నింటికి స్క్రీనింగ్ పూర్తిచేసి వాటిలోని ఓ మంచి చిత్రాన్ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్‌కు పంపుతారు.
ఆస్కార్ ఎంట్రీ లిస్టులో 'డియర్ కామ్రేడ్'
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్'.. ఆస్కార్ ఎంట్రీలో భాగంగా స్క్రీనింగ్‌కు ఎంపికైంది.
ఆస్కార్ ఎంట్రీ లిస్టులో `డియర్ కామ్రేడ్`
'డియర్ కామ్రేడ్' మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రం. ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతుంది. వీటిలో ఉత్తమ సినిమాను ప్రకటిస్తారు. ప్రముఖ ఫిలిం మేకర్ అపర్ణ సేన్ అధ్యక్షతన ఈ జ్యూరీ పని చేస్తుంది.
'డియర్ కామ్రేడ్'లో రష్మిక మందణ్న హీరోయిన్. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించాడు. భరత్ కమ్మ దర్శకుడు. మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Last Updated : Oct 1, 2019, 11:55 AM IST