విజయ్ దేవరకొండ కథానాయకుడిగా.. భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' తెరకెక్కుతోంది. 'గీత గోవిందం' తర్వాత విజయ్.. రష్మిక జంటగా నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా కొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. మాస్ లుక్‌తో ఆకట్టకునేలా ఉందీ భామ. ఈనెల 8న చిత్రంలోని మొదటి పాటను విడుదల చేస్తున్నారు.
రష్మికకు విషెస్ కాస్త డిఫరెంట్‌గా.. - vijay devarakonda
రష్మిక మంధాన పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేసింది డియర్ కామ్రేడ్ చిత్రబృందం. హీరో విజయ్ దేవరకొండ వినూత్నంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు.
డియర్ కామ్రేడ్
వినూత్నంగా రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు విజయ్ దేవరకొండ. 'డియర్ కామ్రేడ్' టీజర్‌పై అభిమానులు ఫన్నీగా చేసిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఇవీ చూడండి.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న 'కెప్టెన్ మార్వెల్'