విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక (Rashmika) జంటగా దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'(Dear Comrade). తెలుగులో అనుకున్న స్థాయిలో విజయం అందులేకపోయింది. కాలేజి, క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమాను ఓ ప్రముఖ సంస్థ హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ఇటీవలే 250 మిలియన్ల (25 కోట్ల) వీక్షణలు దక్కించుకుంది. దీంతో పాటు ప్రస్తుతం 3 మిలియన్ (30 లక్షల) లైక్స్ మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా 'డియర్ కామ్రేడ్' దూసుకెళ్తోంది.
Dear Comrade: హిందీలో సరికొత్త రికార్డు - విజయ్ దేవరకొండ రష్మిక
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక (Rashmika) జంటగా తెరకెక్కిన చిత్రం 'డియర్ కామ్రేడ్'(Dear Comrade). ఈ సినిమా హిందీలో డబ్ వర్షెన్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అటు వీక్షణలతో పాటు లైక్స్‌లోనూ దూసుకెళ్తోంది.

టాలీవుడ్‌కు చెందిన ఓ సినిమా డబ్ అయి యూట్యూబ్‌లో ఇంతటి ప్రేక్షకాదరణ పొందడం విశేషం. విజయ్, రష్మిక నటన చాలా బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు వీక్షకులు. ఏది ఏమైనా బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చేశాడీ 'డియర్ కామ్రేడ్'. ఇదిలా ఉంటే పూరీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రం 'లైగర్'. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, హిందీలోనూ విడుదల కాబోతుంది. ఇలా ఈసారి బాలీవుడ్ ప్రేక్షకుల్ని ప్రత్యక్షంగా పలకరించనున్నాడు హీరో విజయ్ దేవరకొండ.
ఇదీ చూడండి..Liger: విజయ్ 'లైగర్'లో అమెరికన్ దిగ్గజ బాక్సర్!