తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డియర్ కామ్రేడ్​ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే... - మైత్రీ మూవీ మేకర్స్

ప్రేక్షకుల ముందుకు శుక్రవారం వచ్చిన 'డియర్ కామ్రేడ్'.. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.11 కోట్లకు పైగా షేర్ సాధించింది. హీరో విజయ్ దేవరకొండ కెరీర్​లో ఇదే అత్యధికం.

డియర్ కామ్రేడ్​ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..!

By

Published : Jul 27, 2019, 6:52 PM IST

'గీత గోవిందం'తో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక మందణ్న.. 'డియర్ కామ్రేడ్'​తో ప్రేక్షకుల్ని శుక్రవారం పలకరించారు. అభిమానుల మనసు గెల్చుకున్న ఈ సినిమా వసూళ్లలో జోరు చూపించింది. విడుదలకు ముందే రూ.33 కోట్ల బిజినెస్​ చేసిన ఈ చిత్రం.. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.11 కోట్లకు పైగా షేర్ దక్కించుకుంది. ఇది విజయ్ కెరీర్​లోనే అత్యుత్తమం.

మొదటిరోజు కలెక్షన్స్‌లో నైజాం-రూ.3.05 కోట్లు, ఈస్ట్‌-రూ.91 లక్షలు, సీడెడ్‌, ఉత్తరాంధ్ర- రూ.87 లక్షలు వచ్చాయి. అమెరికాలోనూ చక్కటి వసూళ్లే దక్కాయి. అక్కడ కామ్రేడ్‌ తొలిరోజు రూ.1.60 కోట్లు రాబట్టాడు.

భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. దక్షిణాదిలో నాలుగు భాషల్లో ఒకేసారి విడుదలైంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కామ్రేడ్‌కు పోటీగా మరో సినిమా లేకపోవడం చిత్రబృందానికి ఆనందం కలిగించే విషయం. వారం తిరిగేసరికి బ్రేక్‌ ఈవెన్‌ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది చదవండి: సమీక్ష: భావోద్వేగాల 'డియర్ కామ్రేడ్'

ABOUT THE AUTHOR

...view details