David warner Pushpa dance: మైదానంలో అడుగుపెట్టాడంటే రెచ్చిపోయే ఆసీస్ బ్యాటర్, సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలోనూ తగ్గేదేలే అంటున్నాడు. తాజాగా అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలో మరో పాటకు స్టెప్పులేసి అభిమానుల్ని ఫిదా చేశాడు. శ్రీవల్లి సాంగ్‌కు డేవిడ్ వేసిన స్టెప్పుల వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో అచ్చంగా అల్లు అర్జున్‌ను గుర్తుకు తెచ్చేలా (చెప్పు కాలి నుంచి జారిపడిన స్టెప్పుతో సహా) డేవిడ్ వేసిన స్టెప్పు అదిరిపోయింది. 'పుష్పా.. వాట్ నెక్స్ట్' అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో డేవిడ్ పోస్ట్ చేసిన ఈ వీడియోను మూడు గంటల వ్యవధిలోనే దాదాపు 8.8 లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు వార్నర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అలాగే, తన పాటకు వార్నర్ డ్యాన్స్ చేయడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించారు. నవ్వుతూ.. ఫైర్ ఎమోజీలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
తగ్గేదేలే అంటోన్న వార్నర్.. 'శ్రీవల్లి' సాంగ్‌కు స్టెప్పులు - David warner Pushpa dance video
David warner Pushpa dance: వీలు చిక్కినప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరించే ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. మరోసారి సరికొత్త పాటతో మన ముందుకొచ్చాడు. ఈసారి 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి అభిమానుల్ని ఫిదా చేశాడు.
గతంలో కరోనా సమయంలో క్రికెట్ ఆడలేకపోయిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్.. తన భార్యతో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియోలతో భలేగా ఫేమస్ అయిపోయాడు. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురం'లో క్యాండీ వార్నర్‌తో కలిసి 'బుట్టబొమ్మ'.. మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరూ'లో మైండ్ బ్లాక్ పాటలకు స్టెప్పులేసి తనలోని మరో కోణాన్ని బయటకు తీసిన వార్నర్.. ఆ తర్వాత వరుసగా క్రికెట్ మ్యాచ్‌లతో బిజీ అయిపోయాడు. మళ్లీ ఇటీవల అల్లు అర్జున్ 'పుష్ప'లోని యే బిడ్దా.. ఇది నా అడ్డా..’ పాటను ఇమిటేట్ చేస్తూ విడుదల చేసిన వీడియోతో అలరించాడు.
ఇవీ చూడండి: