తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దత్తాత్రేయ - pawan kalyan birthday updates

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఫోన్ లో మాట్లాడి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దత్తాత్రేయ
పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దత్తాత్రేయ

By

Published : Sep 2, 2020, 7:23 PM IST

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ లో మాట్లాడి ఆయనకు జన్మదిన సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ గొప్ప ప్రజాదరణ ఉన్న నటుడని కొనియాడారు. రాజకీయాల్లో ప్రవేశించి సేవ భావంతో ప్రజా సంక్షేమం కోసం ప్రజల వైపు నిలబడి పోరాటం చేయడం అభినందనీయమన్నారు.

పవన్... దత్తాత్రేయను సిమ్లాకు వచ్చి కలుస్తానన్నారు. కుటుంబ సభ్యులతో పాటు విచ్చేసి దైవ భూమిని, ప్రకృతి సౌందర్యాలను వీక్షించాలని కోరారు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలను ఇచ్చి శక్తి సామర్థ్యాలను పెంపొందించే విధంగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నట్లు బండారు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details