Bheemla Nayak OTT Release Date: అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ రానాతో కలిసి ఆయన నటించిన యాక్షన్ డ్రామా 'భీమ్లానాయక్'. మలయాళంలో ఘన విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. సాగర్ కె.చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కు తగినట్లు 'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో మార్పులు చేసి హిట్ అందుకుంది. మార్చి 25న ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది.
ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్న 'ఆహా' తాజా ఈ చిత్ర రిలీజ్‌పై ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు థియేటర్లలో దుమ్ము రేపిన భీమ్లా నాయక్ ఇక ఇంట్లో కూడా మాస్ జాతరను కొనసాగించనుంది. మార్చి 25 నుంచి ఆహా వేదికగా రానుంది.