డార్లింగ్ ప్రభాస్‌కు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఆ వార్త నిజమా..కాదా.. నిజమే అయితే ఆ గుడ్ న్యూస్ ఎప్పుడూ అంటూ అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా..! మరేంటో కాదండీ త్వరలో మన డార్లింగ్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడట..
పుకార్లే అనుకున్నా.. ఆమె స్పందించారు 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్న ఈ ఛత్రపతి వివాహంపై 'సాహో' సినిమా నుంచే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పుకార్లే అని అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మకూడదని అభిమానులు భావించారు. కానీ ప్రస్తుతం డార్లింగ్ పెళ్లి మీద ఆశలు పెట్టుకోవడానికి ఓ కారణం ఉంది. అది స్వయానా ప్రభాస్ పెద్దమ్మ శ్యామాలా దేవి ఇటీవల ఓ పత్రికతో ముచ్చటించారు. ఆ సమయంలో ఆమె ప్రభాస్ వివాహం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.