'ఆదిపురుష్' కోసం ప్రభాస్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. చిత్రంలోని పాత్రకు తగ్గట్టుగా ఆయన నాజూగ్గా మారుతున్నారు. ఇటీవల ఆయన లుక్ బయటికొచ్చింది. సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఇదివరకటి కంటే సన్నగా, దృఢంగా కనిపిస్తున్నారు ప్రభాస్. కొంతకాలం కిందటే లుక్ టెస్ట్‌లో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత ప్రత్యేక నిపుణుల సమక్షంలో కసరత్తులు మొదలు పెట్టినట్టు సమాచారం.
'ఆదిపురుష్' కోసం ప్రభాస్ కసరత్తులు షురూ! - ఆదిపురుష్ కోసం బరువు తగ్గిన ప్రభాస్
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో 'ఆదిపురుష్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొంతకాలం కిందటే లుక్ టెస్ట్‌లో పాల్గొన్న ఆయన.. ఫిట్నెస్ నిపుణుల సమక్షంలో నాజూగ్గా తయారవుతున్నట్లు సమాచారం.
'ఆదిపురుష్' కోసం ప్రభాస్ కసరత్తులు షురూ!
ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న 'ఆదిపురుష్' చిత్రం, రామాయణంలోని యుద్ధ నేపథ్యాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. యుద్ధవీరుడు శ్రీరాముడుగా ప్రభాస్ తెరపై సందడి చేస్తారన్నమాట. ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్ కథానాయకుడు సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారు. కథానాయిక ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్'లో నటిస్తున్నారు.