తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శత్రువులకు దడ పుట్టించే 'దర్బార్‌' - tamil

తమిళ తలైవా రజనీకాంత్​, ప్రముఖ దర్శకుడు ఏఆర్​ మురుగదాస్​ కాంబినేషన్​లో వస్తోన్న చిత్రం 'దర్బార్​'. ఈ చిత్రంలోని రజనీ రెండో లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విలన్లకు దడపుట్టించేలా కనిపిస్తున్నాడు.

శత్రువులకు దడ పుట్టించే 'దర్బార్‌'

By

Published : Sep 12, 2019, 9:55 AM IST

Updated : Sep 30, 2019, 7:39 AM IST

దర్బార్​ చిత్రంలో కండలు పెంచి పోరాటానికి సై అంటున్నాడు హీరో రజనీకాంత్‌. తాజాగా సినిమాలోని రజనీ రెండో లుక్​ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఆకట్టుకునే దేహదారుడ్యంతో కనిపిస్తున్నాడు. ఇది ఎన్​కౌంటర్​ స్పెషలిస్ట్​ పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి లుక్​లో పోలీసు అధికారిగా ఆకట్టుకున్నాడు. ప్రతినాయకుడిగా ప్రతీక్‌ బబ్బర్‌ నటిస్తున్నాడు.

రెండో లుక్​లో రజనీకాంత్​

ఏఆర్​ మురుగదాస్​ దర్శకుడు. లైకా ప్రొడక్షన్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో... నయనతార కథానాయిక. అలీరాజా శుభకరన్‌ నిర్మాత. అనిరుధ్​ సంగీతం సమకూరుస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రానుంది.

దర్బార్​లో నయన్​

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details