సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన 'దర్బార్' సినిమా ఫస్ట్ సాంగ్ విడుదలైంది. దీంతో తలైవా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 'దుమ్మూ దూళి' అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు పాడారు. అనిరుధ్ అందించిన సంగీతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్ 'ఆదిత్య అరుణాచలం' అనే పోలీస్ అధికారి పాత్రలో నటించారు.
దుమ్ములేపుతున్న 'దర్బార్' సాంగ్ - దర్బార్ సినిమా మొదటి పాట
సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన 'దర్బార్' చిత్రం మొదటి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఈ సాంగ్ను పాడారు. దీంతో రజనీ అభిమానులు సందడి చేసుకుంటున్నారు.
దుమ్ములేపుతున్న 'దర్బార్' సాంగ్
నయనతార కథానాయిక. నివేదా థామస్, ప్రకాశ్‌రాజ్, యోగిబాబు, మనోబాలా, సుమన్, హరీష్ ఉత్తమన్, ఆనంద్‌రాజ్, శ్రీమన్‌లు కీలకపాత్రలు పోషించారు. కొన్నిరోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇటీవల డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది.
ఇది చదవండి: పవన్ కల్యాణ్ 'జార్జ్‌రెడ్డి' పాత్ర చేయాలనుకున్నారు!