సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం 'దర్బార్.' ఇటీవలే రజనీ మాస్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చాలా రోజుల విరామం తర్వాత సూపర్‌స్టార్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్తల వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఓ ప్రముఖ వెబ్‌సైట్ దర్బార్ మోషన్ పోస్టర్‌ను క్రియేట్ చేసింది. టైటిల్స్‌తో కూడిన ఈ వీడియో డైరెక్టర్ మురగదాస్‌ని మెప్పించింది. ఇంకేముంది ఆ చిన్నపాటి వీడియోను పోస్ట్ చేస్తూ.. " ఇది దర్బార్ సర్‌ప్రైజ్. రజనీ మాస్ లుక్‌లో కనిపించే ఆసక్తికరమైన మోషన్ పోస్టర్" అని సందేశం పెట్టాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
దర్బార్ దర్శకుడిని మెప్పించిన 'సర్‌ప్రైజ్...' - సూపర్‌స్టార్ రజనీకాంత్ మోషన్ పోస్టర్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'దర్బార్.' ఇప్పటికే టైటిల్ లోగో, రజనీ ఫస్ట్‌లుక్‌తో అంచనాలు పెంచేసింది చిత్రబృందం. శనివారం ఓ అభిమాని తయారుచేసిన మోషన్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాడు చిత్ర దర్శకుడు మురగదాస్.
దర్బార్ సర్‌ప్రైజ్... మంటల్లోంచి రజనీ వాకింగ్
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై మూడు భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో... రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. నయనతార కథానాయిక. ఇందులో విజయ్ సేతుపతి, యోగిబాబు, ఆనంద్ రాజ్, బోస్ వెంకట్, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుందీసినిమా.