తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి' - దర్బార్​ సినిమా తాజా వార్తలు

ప్రముఖ దర్శకుడు ఏఆర్​ మురుగదాస్​ తాజాగా మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసు భద్రత కల్పించాలని పిటిషన్​ దాఖలు చేశాడు. 'దర్బార్​' సినిమా పంపిణీదారుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని అందులో పేర్కొన్నాడు.

Darbar director AR Murugadoss seeks police protection as distributors demand compensation
'నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి'

By

Published : Feb 7, 2020, 10:22 AM IST

Updated : Feb 29, 2020, 12:15 PM IST

'దర్బార్​' సినిమా కాసుల వర్షం కురిపించిందని చిత్రబృందం ఓవైపు పోస్టర్లు విడుదల చేస్తే.. ఆ సినిమా దర్శకుడు మురుగదాస్‌కు మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. తనను చంపేస్తామని పంపిణీదారులు బెదిరిస్తున్నట్లు తాజాగా మద్రాస్​ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడీ స్టార్​ డైరెక్టర్​. తక్షణమే పోలీసు భద్రతకు ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు మురుగదాస్​.

దర్బార్​ సినిమాలో రజనీకాంత్​

నష్టాల్లో నిర్మాణ సంస్థ..

కొంతమంది పంపిణీదారులు తమ ఇబ్బందులు పంచుకోవటానికి రజనీకాంత్​ నివాసానికి వెళ్లగా, పోలీసులు వారిని అనుమతించలేదట. తాజాగా వారందరూ దర్శకుడు మురుగదాస్‌ను కలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కోపంతో ఉన్న మరికొందరు బెదిరింపులకూ పాల్పడుతున్నట్లు ఈ స్టార్​ డైరెక్టర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడట. అంతేకాకుండా తన నివాసానికి వెంటనే పోలీస్‌ భద్రతను ఇప్పించాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో మురుగదాస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇటీవలే డిస్ట్రిబ్యూటర్లకు సాయం చేసే పరిస్థితిలో లేనట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ చెప్పినట్లు కోలీవుడ్​ వర్గాల సమాచారం.

ఇదీ చూడండి..11 రోజుల్లో 'రజనీ' ఖాతాలో రూ.200 కోట్లు..!

Last Updated : Feb 29, 2020, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details