తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాక్సాఫీస్​ వద్ద 'దర్బార్'​ ధమాకా- రూ.150 కోట్ల కలెక్షన్స్​! - 'Darbar' box office collection worldwide

సూపర్​స్టార్ రజనీకాంత్, దర్శకుడు ఏఆర్ మురగదాస్ కాంబినేషన్​లో వచ్చిన చిత్రం 'దర్బార్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్న ఈ చిత్రం... బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు జోరు చూపిస్తోంది.

'Darbar' Boxoffice
బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన 'దర్బార్'!

By

Published : Jan 14, 2020, 10:18 AM IST

తలైవా రజనీకాంత్‌ సినిమా ఎప్పుడు విడుదలైనా థియేటర్ల వద్ద పండగ వాతావరణమే. అదే ఆయన సినిమా పండుగకు వస్తే ఆ హంగామానే వేరు. అలా మురగదాస్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన చిత్రం 'దర్బార్‌'. ఇందులో దాదాపు పాతికేళ్ల తర్వాత రజనీ వెండి తెరపై పోలీసు అధికారి గెటప్​లో దర్శనమిచ్చాడు.

సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం... పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగానూ రికార్డుల వేటలో దూసుకెళ్తోంది. ఈ ఏడాది విడుదలైన మొదటి పాన్‌ ఇండియా మూవీ ఇదే. అయితే మొదటి ఐదు రోజుల్లోనే రూ.150కోట్లు వసూళ్లు రాబట్టుకొంది. ఈ సందర్భంగా సినిమా నిర్మాణ సంస్థ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.

150 కోట్ల వసూళ్లు సాధించినట్లు పేర్కొన్న లైకా సంస్థ

"ఆట ఎవరైనా ఆడతారు.. కానీ సింహాసనం మాత్రం రాజుకే దక్కుతుంది.. ఇదిగో దర్బార్‌ వరల్డ్‌వైడ్‌ కలెక్షన్లు" అని రాసుకొచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార, ప్రతినాయకుడిగా సునీల్‌ శెట్టి, కీలక పాత్రలో నివేథ థామస్‌ కనిపించారు. అనిరుధ్​ రవిచందర్​ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్​ సంస్థ నిర్మించింది.

ABOUT THE AUTHOR

...view details