ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినీ ప్రేక్షకులకు.. 'జేమ్స్ బాండ్' సిరీస్ 'నో టైమ్ టు డై' చిత్రబృందం తీపి కబురు అందించింది. ఈ సినిమాను ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అన్ని భాషల డబ్బింగ్ పనులు పూర్తయిపోయినట్లు వెల్లడించింది. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబరులో థియేటర్లలోనే సందడి చేయనుందీ సినిమా. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.
చివరిసారి బాండ్ పాత్రలో...
2005 నుంచి తెరకెక్కిన బాండ్ సిరీస్ చిత్రాల్లో డేనియల్ క్రెగ్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. బాండ్ సిరీస్‌లో 25వ సినిమాగా 'నో టైమ్ టు డై' తెరకెక్కింది. ఈ చిత్రంలో చివరిసారిగా బాండ్ పాత్రలో అలరించనున్నారు క్రెగ్.