ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'జేమ్స్‌బాండ్' ఫేమ్ డేనియల్ క్రెయిగ్.. సంచలన ప్రకటన చేశాడు. సినిమాల ద్వారా తను సంపాదించిన వేలకోట్ల ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తన పిల్లలకు ఇవ్వనని ఇటీవలే ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.
మాజీ భార్య ఫియొన లౌడొన్ కూతురు ఎల్లా, ప్రస్తుత భార్య రాచెల్ వెయిజ్ కూతురు.. డేనియల్ సంతానం. కాగా.. వెయిజ్ తనయుడు హెన్రీకి కూడా డేనియల్ క్రెయిగ్ పినతండ్రి.
"తర్వాత తరానికి ఆస్తి పంచాలని నేను ఆశించడం లేదు. నా దృష్టిలో వారసత్వం చాలా అసహ్యకరమైంది. 'వారసత్వానికి చాలా దూరంగా ఉండాలి లేదా మరణానికి ముందే వారికి ఆస్తులు పంచేయాలి' అనే సూత్రాన్ని నేను నమ్ముతా."
--డేనియల్ క్రెయిగ్, నటుడు.