'జేమ్స్ బాండ్' పాత్రలో తనదైన పెర్ఫార్మెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డేనియల్ క్రెయిగ్. ఆయన యాక్షన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. 'జేమ్స్ బాండ్' సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సినిమాలు చేసిన ఆయన త్వరలో 'నో టైమ్ టు డై'(James Bond No Time To Die) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఆయనకు ఓ అరుదైన గౌరవం దక్కింది. గురువారం ఆయన బ్రిటీష్ రాయల్ నేవీలో గౌరవ కమాండర్‌గా(James Bond Royal Navy) నియమితులయ్యారు.
ఈ విషయాన్ని 'జేమ్స్ బాండ్' తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. సీనియర్ సర్వీసులో గౌరవ కమాండర్ హోదాలో నియామకం కావడాన్ని డేనియల్ విశేషంగా, గౌరవంగా భావిస్తున్నట్లు అందులో పేర్కొంది.