సినీ కార్మికులు, హెల్త్ వర్కర్స్ కోసం దగ్గుబాటి కుటుంబం భారీ విరాళాన్ని ప్రకటించింది. దేశంలో కొవిడ్-19 విషపు కోరలు చాస్తోన్న తరుణంలో దానిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో సినీ పరిశ్రమకు చెందిన పనులన్నీ వాయిదా పడ్డాయి. సినీ పరిశ్రమపైనే ఆధారపడి జీవితాన్ని సాగిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడెక్షన్స్ బ్యానర్ తరఫున దగ్గుబాటి సురేశ్ బాబు, వెంకటేశ్, రానా రూ.కోటి విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.
దగ్గుబాటి కుటుంబం నుంచి భారీ విరాళం - దగ్గుబాటి ఫ్యామిలీ
కరోనా ప్రభావంతో చిత్రీకరణలన్నీ వాయిదా పడ్డాయి. ఇది సినీ పరిశ్రమపై ఆధారపడి పని చేస్తున్న వారికి తీవ్ర ఆర్థిక సమస్యలను మిగిల్చింది. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ వంతు సహాయంగా పేద కళాకారులకు విరాళాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడా జాబితాలో దగ్గుబాటి కుటుంబం చేరింది.
ఇప్పటికే సినీ కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్లు టాలీవుడ్ అగ్రకథానాయకుడు చిరంజీవి ప్రకటించారు. అలాగే కరోనాపై పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, దిల్‌రాజు, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి తమ వంతు విరాళాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా కరోనా నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి.. కోహ్లీ కోసం హెయిర్ స్టైలిష్ట్‌గా మారిన అనుష్క