ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ(Daboo Ratnani).. మరోసారి తన కెమెరాతో నెటిజన్లను ఫిదా చేశారు. 'డబూ రత్నానీ క్యాలెండర్' పేరుతో ఆయన ప్రతి ఏటా సెలబ్రిటీ ఫొటోలతో స్పెషల్ క్యాలెండర్‌ను విడుదల చేస్తుంటారు. బాలీవుడ్‌కు చెందిన విద్యాబాలన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, సన్నీలియోనీ, ఆలియాభట్, శ్రద్ధాకపూర్, హృతిక్‌రోషన్ వంటి స్టార్ల స్టన్నింగ్ లుక్స్‌తో ఈ ఏడాది క్యాలెండర్ సిద్ధమైంది.
Viral: సన్నీకిరాక్ లుక్.. స్టైలిష్‌గా రౌడీ హీరో - Daboo latest calendar photoshoot with Vijay Devarkonda
సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ(Daboo Ratnani).. అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, సన్నీలియోనీ సహా పలువురు నటుల ఫొటోలతో ఈ ఏడాది క్యాలెండర్‌ను త్వరలో ఆవిష్కృతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన తీసిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ భాగమవ్వడం విశేషం..
![Viral: సన్నీకిరాక్ లుక్.. స్టైలిష్‌గా రౌడీ హీరో daboo ratnani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12131262-273-12131262-1623676898606.jpg)
త్వరలో ఆవిష్కృతం కానున్న క్యాలెండర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. విక్కీ కౌశల్(Vicky Kaushal), విజయ్ దేవరకొండ(Vijaydevarakonda), అభిషేక్ బచ్చన్(Abhishek Bachan).. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఆకట్టుకోగా.. విద్యాబాలన్(Vidya Balan), సన్నీలియోనీ(SunnyLeone) కిల్లింగ్ లుక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, బీటౌన్ బ్యూటీ తారా సుతారియా మొదటిసారి ఈ క్యాలెండర్‌లో భాగమవ్వడం విశేషం.
ఇదీ చూడండి: కియారా టాప్‌లెస్ ఫొటోకు స్ఫూర్తి అదే: డబూ రత్నానీ