తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దబాంగ్‌ 4' అప్​డేట్.. నవ్వులు పంచే మహానటులు - తిగ్మన్షు దులియా

Dabangg 4 Director: సల్మాన్​ ఖాన్ హీరోగా 'దబాంగ్ 4' సినిమా త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది. ఇందుకోసం తిగ్మన్షు దులియా కథను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.

salman khan
సల్మాన్ ఖాన్

By

Published : Dec 31, 2021, 7:05 AM IST

Dabangg 4 Director: సల్మాన్‌ ఖాన్‌ పోషించిన పాత్రల్లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న పాత్రల్లో ఒకటి చుల్‌బుల్‌ పాండే. 'దబాంగ్‌' ఫ్రాంఛైజీలో వచ్చిన మూడు చిత్రాల్లోనూ పోలీస్‌ అధికారి చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ నటన ప్రేక్షకుల్ని అలరించింది. త్వరలోనే 'దబాంగ్‌ 4' రానుంది. ఈ సినిమాకు దర్శకుడిగా తిగ్మన్షు దులియా దాదాపు ఖరారైనట్లే అనిపిస్తోంది. ఈ చిత్రం కోసం తిగ్మన్షు చెప్పిన స్టోరీ లైన్‌ సల్మాన్‌కు బాగా నచ్చిందట. దీంతో ఈ స్క్రిప్టుపై తిగ్మన్షు సంవత్సరం నుంచి కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే పూర్తి స్క్రిప్టుని సల్మాన్‌కు వినిపించనున్నారట. 'పాన్‌ సింగ్‌ తోమర్‌', 'సాహెబ్‌ బీవీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌' చిత్రాలతో అలరించారు తిగ్మన్షు. సల్మాన్‌ ప్రస్తుతం ఏడెనిమిది చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి ఈ కొత్త చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి.

నవ్వులు పంచే 'మహానటులు'

నవ్వులు పంచే మహానటులు

అభినవ్‌ మణికంఠ, గోల్డీ నిస్సీ, వీజే మ్యాడీ, పవన్‌ రమేష్‌, భరత్‌ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మహానటులు'. అశోక్‌ కుమార్‌ దర్శకుడు. అనిల్‌ బొడ్డిరెడ్డి, తిరుపతి ఆర్‌ యర్రంరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్‌, క్యారెక్టర్‌ రివీల్‌ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, బిగ్‌బాస్‌ విజేత సన్నీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ "టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో అంతా మహానటులే. పూర్తి వినోదాత్మక కథతో రూపొందుతోంది. మన చూట్టూ ఉండే ఓ నాలుగు క్యారెక్టర్స్‌ ఈ కథలో ఉంటారు. వాళ్లు మహానటులు అనే యూట్యూబ్‌ ఛానెల్‌తో ఎలా పైకి ఎదిగారన్నది చిత్ర కథ" అన్నారు.

"సినిమా చాలా వినోదభరితంగా ఉంటుంది. నేనిందులో ఓ మంచి పాత్ర చేశా" అన్నారు నటుడు వీజే మ్యాడీ. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ "సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చేలా ఉంటుంది. మేము త్వరలో ఎమ్మెల్యే సీతక్క బయోపిక్‌ తీయనున్నాం" అన్నారు. "మంచి సినిమా ఇది. నాలాంటి కొత్త వాళ్లకు అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. ఈ చిత్రం చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం" అంది నాయిక గోల్డీ నిస్సీ. ఈ చిత్రానికి సంగీతం, కథ, మాటలు: పి.సుధీర్‌ వర్మ.

ఇదీ చదవండి:

డిప్రెషన్​లోకి వెళ్లా.. రాజమౌళి వల్లే కోలుకున్నా: ఎన్టీఆర్

'ఆర్ఆర్ఆర్'లో ఆ ఇద్దరివి గెస్ట్ రోల్స్: రాజమౌళి

ABOUT THE AUTHOR

...view details