బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటిస్తోన్న చిత్రం 'దబాంగ్-3'. ఆదివారంతో చిత్రీకరణ పూర్తయింది. వినోద్‌ఖన్నా పుట్టినరోజున షూటింగ్ ముగిసిన సందర్భంగా ఆ నట దిగ్గజానికి నివాళులు అర్పించింది చిత్రబృందం.
" నేడు 'దబాంగ్-3' చిత్రీకరణకు చివరిరోజు. వినోద్ ఖన్నా పుట్టినరోజున షూటింగ్ పూర్తి కావడం ఆనందించే విషయం. ఆయన ఈ సిరీస్‌లోని గత చిత్రంలో ప్రజాపతి పాండే పాత్ర పోషించారు. ఇప్పుడు సీక్వెల్లో అదే రోల్‌ను తన సోదరుడు ప్రమోద్ ఖన్నా చేస్తున్నారు" -- సల్మాన్‌ఖాన్, సినీ నటుడు
తొలిసారి దక్షిణాదిన...
ఈ సినిమా షూటింగ్ మొత్తం.. మహేశ్వర్, మధ్యప్రదేశ్, జైపూర్, రాజస్థాన్‌లలో జరిగింది. తొలిసారి సల్మాన్ ఖాన్ నటించిన సినిమా దక్షిణాది భాషల్లోనూ విడుదల కానుంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోని ప్రేక్షకుల్ని పలకరించనుంది. తెలుగు వెర్షన్ బాధ్యతలను సురేశ్ ప్రొడక్షన్స్ తీసుకుంది.
ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇంతకు ముందొచ్చిన 'దబాంగ్', 'దబాంగ్ 2' మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మూడో భాగం అలానే హిట్ అవుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసుతోంది. 'దబాంగ్ 3' డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది.