తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: 'దబంగ్​ 3'తో​ భాయ్​ అలరించాడా? - latest prabhu deva movie news

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​-ప్రభుదేవా కాంబినేషన్​లో వచ్చిన చిత్రం 'దబంగ్​ 3'. సోనాక్షి సిన్హా హీరోయిన్. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాతో భాయ్​ మెప్పించాడా? లేదా? అని తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.

dabang 3 movie review today released as teh pan india cinema
'దంబాగ్​ 3' తో సల్మాన్​ భాయ్​ హిట్టు కొట్టాడా?

By

Published : Dec 20, 2019, 1:32 PM IST

Updated : Dec 20, 2019, 1:52 PM IST

చిత్రం:దబంగ్‌ 3

నటీనటులు: సల్మాన్‌ ఖాన్‌, సోనాక్షి సిన్హా, సయీ మంజ్రేకర్‌,సుదీప్‌ తదితరులు

దర్శకత్వం: ప్రభుదేవా

నిర్మాతలు:సల్మాన్‌ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్‌, నిఖిల్‌ ద్వివేది

సంగీతం: సుదీప్‌ శిరోద్కర్‌

విడుదల తేదీ: 20-12-2019

స్టైలిష్​గా ఉన్న సల్మాన్​ ఖాన్​

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ 'దబంగ్‌', 'దబంగ్‌ 2' చిత్రాల్లో పోలీస్‌ పాత్రలో నటించి అలరించాడు. ఎంతోమంది యాక్షన్‌ సినిమా అభిమానులను సొంతం చేసుకున్నాడు. 'దబంగ్‌' ప్రాంఛైజీలోని మూడో భాగం 'దబంగ్‌ 3'తో నేడు(శుక్రవారం) ప్రేక్షకులను ముందుకొచ్చాడు. మరోసారి పోలీస్‌ గెటప్‌లో కనిపించి అలరించాడా? అనేది తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.

'దబంగ్‌', 'దబంగ్‌ 2' సినిమాల్లో చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ అలరించాడు. ధాకడ్‌ అనే ఓ సాధారణ యువకుడి నుంచి చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ ఎలా మారాడో తెలియచేసే కథే 'దబంగ్‌ 3'. ఖుషీ ప్రేమను ఎలా దూరం చేసుకున్నాడు? విలన్స్‌పై ఎలా పోరాటం చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

కథేంటంటే:

చుల్‌బుల్‌ పాండే (సల్మాన్‌ఖాన్‌) ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌. తన భార్య రాజో (సోనాక్షి సిన్హా), సోదరుడు మక్కీ (అర్బాజ్‌ఖాన్‌)తో ఎంతో సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సల్మాన్‌ తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసి ఎందరో అమ్మాయిలను రక్షిస్తాడు. ఈ విషయం ధనవంతుడైన బల్లి (సుదీప్‌)కు కోపం తెప్పిస్తుంది.

దబాంగ్​ 3లో సల్మాన్​

అక్కడి నుంచి సల్మాన్‌ గతం ప్రారంభమవుతుంది. ఓ సాధారణ యువకుడు.. చుల్‌బుల్‌ పాండేగా ఎందుకు మారాడు. ఎంతగానో ప్రేమించిన ఖుషీ, చుల్‌బుల్‌ పాండేకు ఎందుకు దూరమైంది? అనే విషయాలు తెలియాలంటే 'దబంగ్‌ 3'ను చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

'దబంగ్‌' ప్రాంఛైజీలో తెరకెక్కడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌లోని సల్మాన్‌ యాక్షన్‌, పాటలు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సల్మాన్‌పై చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్, ఎంట్రీ సీన్‌తో పాటు పలు సన్నివేశాలు సల్మాన్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్​ చెప్పిన డైలాగులు మాస్‌కు నచ్చేలా ఉన్నాయి

ఒక పక్క కథలో ప్రేక్షకుడిని లీనం చేస్తూనే, సల్మాన్‌ఖాన్‌ స్టైల్‌, యాక్షన్‌ను అందుకు తగ్గట్టుగా దర్శకుడు చిత్రీకరించిన విధానం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీని బలవంతంగా జోడీంచేందుకు దర్శకుడు ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే:

'దబంగ్‌', 'దబంగ్‌ 2' సినిమాల్లో లాగానే ఇందులోనూ సల్మాన్‌ యాక్షన్‌ ఆకట్టుకునేలా ఉంది. తనదైన శైలిలో సంభాషణలు చెప్పి అలరించాడు. భాయ్​పై చిత్రీకరించిన షర్ట్‌ లెస్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ప్రతినాయకుడు బల్లి పాత్రలో సుదీప్‌ నటన చాలా బాగుంది. సల్మాన్‌ భార్య రజో పాత్రలో కనిపించిన సోనాక్షి పాత్ర పరిధి మేరకు నటించింది

దబాంగ్​ 3 పోస్టర్​

ఇంతకుముందు వచ్చిన 'దబంగ్‌', 'దబంగ్‌ 2' సినిమాల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకున్న సోనాక్షి ఈ సినిమాలో ఆమె పాత్ర అంత కీలకంగా లేదనే చెప్పొచ్చు. సల్మాన్‌ ప్రియురాలు ఖుషీ పాత్రలో సయీ మెప్పించింది. పాత్ర పరిధి మేరకు ఆమె అలరించింది. కాకపోతే కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఇంకా బాగా నటించి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. 'మున్నీ బద్నామ్‌ హూయీ' పాటతో పాటు టైటిల్‌ సాంగ్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా ఆకట్టుకున్నాయి.

బలాలు

+ సల్మాన్‌

+ యాక్షన్‌ సన్నివేశాలు

+ సుదీప్‌

బలహీనతలు

- అతికి అతకని కామెడీ సన్నివేశాలు

- నెమ్మదించిన కథనం

చివరిగా: అన్నీ రుచులు ఉన్న ఓ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!

Last Updated : Dec 20, 2019, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details