సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న దబాంగ్- 3 సినిమాలో సుదీప్ విలన్‌గా నటించనున్నాడు. తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్‌లో తీరికలేకుండా పనిచేస్తున్నట్టు ట్విట్టర్లో తెలిపాడీ హీరో. దబాంగ్ సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది.
సల్మాన్‌ఖాన్‌తో ఫైటింగ్‌కు సై అంటున్న సుదీప్ - salman khan
దబాంగ్ -3 చిత్ర పతాక సన్నివేశం షూటింగ్లో తీరిక లేకుండా పనిచేస్తున్నట్టు కన్నడ హీరో సుదీప్ తెలిపాడు. చొక్కా లేకుండా సల్లూభాయ్‌తో ఫైట్ సీన్లు చేయడం గొప్ప అనుభూతి అని చెప్పాడు.
సుదీప్
"చొక్కా లేకుడా సల్మాన్ ఖాన్‌తో పోరాట సన్నివేశాల్లో నటించడం గొప్ప అనుభూతి. భారీ సెట్లో క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. నిరంతరంగా షూటింగ్ కొనసాగుతోంది. సల్మాన్ ఖాన్‌లా నేను ఫైట్ సీన్లు చేస్తాననుకోలేదు. కానీ ఈ రోజు కొద్దిగా ఆత్మవిశ్వాసం వచ్చింది" -సుదీప్ ట్వీట్.
ప్రభుదేవా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ నిర్మాత. గత రెండు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సోనాక్షి సిన్హా ఇందులోనూ సల్లూ భాయ్ పక్కన ఆడిపాడనుంది.