దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'డీ కంపెనీ'. అష్వత్ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలీ, రుద్రకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 15న స్పార్క్ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలోని 4 నిమిషాల సన్నివేశాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు ఆర్జీవీ.
4 నిమిషాల్లో రామ్‌గోపాల్ వర్మ 'డీ కంపెనీ'!
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'డీ కంపెనీ'. ఈ నెల 15న స్పార్క్ ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 4 నిమిషాల వీడియోను పంచుకుంది చిత్రబృందం.
డీ కంపెనీ
"ఇప్పుడు ముంబయి చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అప్పుడు 40 సంవత్సరాల క్రితం డీ కంపెనీ కంట్రోల్ ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు" అని ఆర్జీవీ చెప్పిన మాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్ లీడర్.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడో ఈ చిత్రంలో చూపించనున్నారు. దావూద్ చరిత్ర ఏంటో మీరూ చూసి తెలుసుకోండి..