తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2020, 3:02 PM IST

ETV Bharat / sitara

అలరిస్తున్న 'క్రష్'​ అన్​లాక్ 1.0 పోస్టర్​

'క్రష్' సినిమాకు సంబంధించిన మరో కొత్త పోస్టర్​ను 'అన్​లాక్ 1.0' పేరుతో విడుదల చేశారు. రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

crush
క్రష్​

టాలీవుడ్​లో కొత్త పంథాలో సినిమాలు తీసే దర్శకుడిగా రవిబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'క్రష్‌' అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్​ను‌ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్​లుక్​లకు తోడుగా, అన్‌లాక్‌ 1.0 పేరుతో తాజాగా కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. ఇందులో ఓ అమ్మాయి తన కాళ్లను శుభ్రం చేసేందుకు రేజర్‌ ఉపయోగిస్తుండగా, తలుపు చాటు నుంచి ముగ్గురు యువకులు మాస్కులు ధరించి ఆమెను చూస్తుంటారు.

ఏ ప్లైయింగ్‌ ఫ్రాగ్స్ ప్రొడక్షన్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలో 'క్రష్'కు సంబంధించి పూర్తి విశేషాలను వెల్లడించనున్నారు.

ఇది చూడండి : స్టార్​హీరోలతో సర్జా.. అరుదైన జ్ఞాపకాల చిత్రమాలిక

ABOUT THE AUTHOR

...view details