డ్రగ్స్ కేసులో(ananya pandey drugs) అరెస్టయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాటింగ్‌లో బాలీవుడ్ నటి అనన్యా పాండే పేరు రావడం వల్ల ఎన్‌సీబీ అధికారులు ఆమెకు ఇటీవలే సమన్లు జారీ చేశారు. గతవారంలో(Bollywood drugs case) రెండు సార్లు ఆమెను ప్రశ్నించిన అధికారులు సోమవారం(అక్టోబర్ 25) మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఉదయం 11 గంటలకు ఆఫీసుకు రావాలని చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల అనన్య విచారణకు హాజరుకాలేదని సమాచారం.
లాయర్‌ను కలిసిన షారుక్ సతీమణి
మరోవైపు ఆర్యన్ కేసును(shahrukh son drugs) వాదిస్తున్న లాయర్ సతీన్ మనెషిండేను షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ సోమవారం కలిశారు. ఈ ఉదయం గౌరీ మన్నత్ నుంచి బయల్దేరగా.. ఆమె జైల్లో ఉన్న తనయుడు ఆర్యన్‌ను కలిసేందుకు వెళ్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఆమె న్యాయవాదిని కలిసి కేసు పురోగతి గురించి చర్చించినట్లు సమాచారం. గతవారం(bollywood drug news) షారుక్ జైలుకు వచ్చి కొడుకును కలిసివెళ్లిన విషయం తెలిసిందే. ముంబయిలో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం వల్ల అక్కడి జైళ్లలో నిబంధనలు సడలించి తమ వారిని కలుసుకునేందుకు వీలు కల్పించారు. అక్టోబరు 21న షారుక్.. ఆర్థర్ రోడ్‌కు వచ్చి ఆర్యన్‌ను 15-20 నిమిషాల పాటు కలిసి ఇంటర్‌కామ్ ద్వారా మాట్లాడారు. సోమవారం షారుక్ - గౌరీ పెళ్లి రోజు కూడా. ఆర్యన్ జైలుకు వెళ్లినప్పటి నుంచి షారుక్ కుటుంబం ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటోంది. కొడుకు ఇంటికొచ్చేదాకా మన్నత్‌లో స్వీట్లు కూడా వండొద్దని ఇప్పటికే గౌరీ తన సిబ్బందికి ఆర్డర్ వేశారు.