తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పానిపత్​​' వెంట వివాదాల తంట - తెలుగు తాజా సినిమా వార్తలు

చారిత్రక నేపథ్యంలో.. ప్రముఖ దర్శకుడు అశుతోష్‌ గొవారికర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పానిపత్​'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా విమర్శలు ఎదుర్కొంటోంది. రాజస్థాన్​లో ఈ చిత్రాన్ని నిషేధించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

critics and protests against panipat movie directed by asitosh govarikar
'పానిపట్​' వెంట వివాదాల తంట

By

Published : Dec 10, 2019, 7:56 AM IST

Updated : Dec 10, 2019, 9:57 AM IST

చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్​తో చిత్రీకరించి.. విడుదలవుతున్న సినిమాలపై అంచనాలతో పాటు వివాదాలు పెరుగుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ చిత్రం పద్మావత్​ను వెంటాడిన వివాదాలు.. తాజాగా​పానిపత్​ను చుట్టుముట్టాయి. ప్రముఖ దర్శకుడు అశుతోష్‌​ గొవారికర్... చారిత్రాత్మక నేపథ్యంలో​ తెరకెక్కించిన చిత్రం 'పానిపత్'​. ఈ నెల 6న విడుదలైన ఈ సినిమా విమర్శలను ఎదుర్కొంటోంది. ఉత్తరాదితో పాటు మరికొన్ని ప్రదేశాల్లో ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని ఒక వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్‌... 'పానిపత్​'ని వెంటనే నిషేధించాలని కోరారు.

అసలు సినిమాలో ఏముంది?

మూడో పానిపత్​ యుద్ధాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ సినిమా మరాఠా యోధుడు సదాశివరావ్‌ భావ్‌గా అర్జున్‌ కపూర్, ఆయన భార్య పార్వతీ భాయ్‌గా కృతిసనన్, అఫ్గానిస్థాన్‌ సైన్యాధిపతి అహ్మద్‌ షా అబ్దాలి పాత్రలో సంజయ్‌ దత్‌ నటించారు. ఈ సినిమాలో జాట్‌ మహారాజా సూరజ్‌మాల్‌ పాత్రను తప్పుగా చిత్రీకరించారని.. వెంటనే ‘పానిపత్’ ప్రదర్శన నిలిపి వేయాలని కోరుతూ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో జాట్‌లు నిరసనలు చేపట్టారు. దర్శకుడు అశితోష్​ గొవారికర్ దిష్టిబొమ్మను కూడా తగలబెట్టారు. ఈ వివాదంపై రాజస్థాన్‌ పర్యాటక శాఖ మంత్రి స్పందించారు.

"ఇందులో చరిత్రని తప్పుగా చూపించటం చాలా బాధాకరమైన విషయం. మహారాజా సూరజ్‌మాల్‌ జాట్‌ కుటుంబంలోని 14వ తరానికి చెందిన వ్యక్తిని నేను. యుద్ధంలో ఓడిపోయాక పీష్వాతోపాటు ఇతర సైన్యం తీవ్రగాయాలతోపానిపత్ నుంచి తిరిగి వచ్చాయి. ఆ సమయంలో మహారాజా సూరజ్‌మాల్, మహారాణి కిషోరి.. పీష్వా, ఇతర సైన్యానికి కొన్ని నెలల పాటు ఆవాసం ఇచ్చారు."

-విశ్వేంద్ర సింగ్‌, రాజస్థాన్​ రాష్ట్ర పర్యాటక మంత్రి

ఏదైనా రాజ్యానికి, గొప్ప వ్యక్తులకు సంబంధించిన చారిత్రక సినిమాలను తెరకెక్కించే ముందు సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకునే విధంగా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్లు విశ్వేంద్ర సింగ్​ తెలిపారు.

ఇది చదవండి: రౌడీ హీరోపై మనసు పారేసుకున్న ఆలియా

Last Updated : Dec 10, 2019, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details