తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రికెటర్​ శ్రీశాంత్​తో హన్సిక ప్రేమాయణం​..!

కేరళ క్రికెటర్ శ్రీశాంత్​తో రొమాన్స్​ చేయనుంది హీరోయిన్ హన్సిక. తమిళంలో వీరిద్దరూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు.

By

Published : Oct 12, 2019, 9:08 AM IST

Updated : Oct 12, 2019, 12:36 PM IST

క్రికెటర్​ శ్రీశాంత్​తో హన్సిక ప్రేమాయణం..!

క్రికెట్‌ కెరీర్‌ బాగా సాగుతున్న సమయంలో వివాదాల్లో ఇరుక్కొని ఆటకు దూరమయ్యాడు​​ శ్రీశాంత్‌. చాలా ఏళ్ల తర్వాత ఇటీవలే ఈ ఆటగాడిపై ఉన్న కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. అతడిపై జీవితకాలపు నిషేధాన్ని ఎత్తేసింది. ఈ సమయంలోనే మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడీ కేరళ క్రికెటర్​​.

దేశముదురు భామతో...

ఇప్పటికే నటుడిగా రాణిస్తున్న శ్రీశాంత్.. కోలీవుడ్​లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు​. ఓ కొత్త సినిమాలో హీరోయిన్ హన్సికతో నటించనున్నాడు. ఇందులో వీరిద్దరి మధ్య రొమాంటిక్​ సన్నివేశాలు కొంచెం ఎక్కువగానే ఉండనున్నాయట.​ హరి శంకర్‌- హరీశ్ నారాయణ్‌ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో సెట్స్​పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం.

ఇంతకు ముందు అక్షర్​, కెబరెట్​ అనే హిందీ సినిమాల్లో నటించాడు శ్రీశాంత్. దక్షిణాదిలో 'టీమ్5' (మలయాళం), కెంపేగౌడ2(కన్నడ) చిత్రాల్లోనూ సందడి చేశాడు.

హన్సిక.. ప్రస్తుతం తెలుగులో ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. సందీప్​ కిషన్​తో కలిసి నటించిన 'తెనాలి రామకృష్ణ ఎల్‌.ఎల్‌.బి' విడుదలకు సిద్ధమవుతోంది.

Last Updated : Oct 12, 2019, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details