వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఓ సినిమాను నిర్మిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్‌ను బ్రావో ఫేస్బుక్లో షేర్ చేశాడు.
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ వ్యాపార దృక్పథమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల. 'ల్యాండ్ ఆఫ్ విడోస్', 'వైట్ నైట్' ఫేం ఆర్తి శ్రీవాత్సవ ఈ చిత్రానికి దర్శకురాలు. ఈ రెండు సినిమాలు డాక్యుమెంటరీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు గెలుచుకోవడం విశేషం.
"డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు సంతోషంగా, గర్వంగానూ ఉంది. జులైలో తమిళనాడులో షూటింగ్ జరుపుకుందీ చిత్రం. ప్రస్తుతం ఇండియాలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెలలో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో చిత్రీకరణ చేయనున్నాం".
-ఆర్తి శ్రీవాత్సవ, దర్శకురాలు
ప్రస్తుతం వెంకటేష్-నాగ చైతన్య కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ 'వెంకీ మామ'ను, అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' అనే చిత్రాలనూ నిర్మిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
ఇది సంగతి: దిశా ఈజ్ బ్యాక్.. మళ్లీ జిమ్‌లో కసరత్తులు