వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ప్రధాన పాత్రధారిగా ఓ లఘు చిత్రం తెరకెక్కబోతోంది. సామాజిక స్పృహపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ చిత్రం రూపొందనుంది. కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సీఆర్‌ఎస్)లో భాగంగా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్‌తో పాటు, మరో నిర్మాత వివేక్ కూచిబొట్ల తెలిపారు.
తెలుగు లఘుచిత్రంలో క్రికెటర్ బ్రావో - people media factory
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఓ లఘుచిత్రంలో నటించనున్నాడు. దీనికి సంబంధించి నిర్మాతలు.. బ్రావోతో శనివారం ఉదయం హైదరాబాద్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు.
లఘు చిత్రానికి సంబంధించి నిర్మాతలు.. బ్రావోతో శనివారం ఉదయం హైదరాబాద్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివారం నుంచి కోయంబత్తూర్‌తో పాటు... వెస్టిండీస్, ట్రినిడాడ్, టొబాగో తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం తెలుగులో 'ఓ బేబీ'తో పాటు, 'వెంకీమామ', అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో 'సైలెన్స్', నాగశౌర్యతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల తెలిపారు.
ఇవీ చూడండి.. 'విజయ నిర్మల మృతి తీరని లోటు'