తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అగ్రహీరోలు.. క్రేజీ మల్టీస్టారర్లు.. సందడే సందడి - ఎఫ్​3 సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్

ఇటీవల కాలంలో తెలుగులో పలు క్రేజీ మల్టీస్టారర్లు తెరకెక్కుతున్నాయి. వాటిలో అగ్రహీరోలు నటిస్తుండటం వల్ల అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? వాటి సంగతేంటి?

CRAZY MULTISTARRERS IN TOLLYWOOD
అగ్రహీరోలు.. క్రేజీ మల్టీస్టారర్లు

By

Published : Dec 25, 2020, 9:00 AM IST

తెరపై ఒక్క హీరో కనిపిస్తేనే గోల చేసి, ఈలలు వేసి హంగామా చేస్తారు అభిమానులు. అలాంటిది అతడితో పాటు మరో కథానాయకుడు కలిసి నటిస్తే ఇంకేమైనా ఉందా? ఫ్యాన్స్ ఆనందానికి అంతే లేకుండా పోతుంది. టాలీవుడ్​కు మల్టీస్టారర్​లు కొత్త కాకపోయినప్పటికీ ఇటీవల కాలంలో తీస్తున్న కొన్ని సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎప్పుడెప్పుడూ ఆ సినిమాల్ని చూస్తామా అనే ఆత్రుతను కలిగిస్తున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? అందులో నటిస్తున్న వారెవరు?

చిరుతో చరణ్

లాక్​డౌన్ అనంతరం ఇటీవల మొదలైన 'ఆచార్య' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు కొరటాల శివ.. సినిమాలో రామ్​చరణ్​ది అతిథి పాత్ర కాదని స్పష్టం చేశారు. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'ఆచార్య'. వీరిద్దరూ పూర్తి స్థాయిలో ఓ చిత్రం చేయడం ఇదే మొదటిసారి కావడం వల్ల సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రామ్​చరణ్​తో చిరంజీవి

బాలయ్యతో శౌర్య

బోయపాటి శ్రీనుతో మూడోసారి కలిసి పనిచేస్తున్న నందమూరి బాలకృష్ణ.. తర్వాతి ఓ యువ దర్శకుడి తీస్తున్న సినిమాలో నటిస్తారు. ఇందులో యంగ్ హీరో నాగశౌర్య కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ త్వరలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది.

నందమూరి బాలకృష్ణ

పవన్​తో రానా

తన అన్ని సినిమాల్లో సింగిల్​ హీరోగా నటించిన పవర్​స్టార్ పవన్​ కల్యాణ్.. తొలిసారి మరో కథానాయకుడితో కలిసి స్క్రీన్ షేర్​ చేసుకోనున్నారు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్​లో రానాతో కలిసి సందడి చేయనున్నారు. ఇటీవల ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో పవన్​ పోలీస్​గా, రానా రిటైర్డ్ మిలటరీ అధికారిగా కనిపించనున్నారు. దీంతో అప్పుడే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

రానా పవన్ కలిసి కొత్త సినిమా

సిద్ధార్థ్​తో శర్వానంద్

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత నేరుగా ఓ తెలుగు సినిమాలో సిద్ధార్థ్ నటిస్తున్నారు. 'మహాసముద్రం' టైటిల్​తో తీస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ మరో కథానాయకుడు. అమరమైన ప్రేమకథ అంటూ ఇప్పటికే చెప్పిన చిత్రబృందం అంచనాల్ని పెంచేసింది. అందుకే సినిమా ఎలా ఉండనుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోంది.

మహాసముద్రం సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్
సిద్ధార్థ్

'ఎఫ్​3'లో రవితేజ?

'ఎఫ్2'కు సీక్వెల్​గా తీస్తున్న 'ఎఫ్​3'లో వెంకటేశ్, వరుణ్ తేజ్​తో పాటు మరో హీరో కూడా నటించనున్నారు. అయితే అది ఎవరనేది ఇంతవరకు వెల్లడించలేదు. దీంతో రవితేజనే మూడో కథానాయకుడిగా చేస్తారంటూ వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి.

సునీల్​ను​ కూడా ఆ పాత్ర కోసం పరిశీలిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి ఎంత నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. బుధవారమే(డిసెంబరు 23) షూటింగ్ ప్రారంభించగా, వెంకటేశ్ పాల్గొన్నారు.

ఎఫ్​3 సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్

ABOUT THE AUTHOR

...view details