తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అర్జున్ రెడ్డి'కి మళ్లీ పెరుగుతున్న క్రేజ్ - కబీర్ సింగ్

'కబీర్ సింగ్'కు వస్తున్న పబ్లిసిటీ కారణంగా ఒరిజినల్ వెర్షన్ 'అర్జున్ రెడ్డి' ట్రైలర్​ను వీక్షించే వారి సంఖ్య పెరిగింది. నాన్ బాహుబలి ట్రైలర్లలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న చిత్రంగా రికార్డు సాధించింది.

'అర్జున్ రెడ్డి'కి మళ్లీ పెరుగుతున్న క్రేజ్

By

Published : Jul 12, 2019, 8:14 PM IST

టాలీవుడ్ బ్లాక్​బస్టర్ 'అర్జున్​రెడ్డి' మళ్లీ క్రేజ్ తెచ్చుకుంటోంది. దీనికి కారణం ఇటీవలే ఈ సినిమాకు చెందిన బాలీవుడ్ రీమేక్​ 'కబీర్ సింగ్' విడుదల కావడమే. కబీర్​ సింగ్​ బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపుతుంటే.. ‘అర్జున్‌రెడ్డి’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది.

కబీర్ సింగ్-అర్జున్ రెడ్డి పోస్టర్

విడుదలైన రెండేళ్ల తర్వాత ఏం రికార్డు అందుకుందా అని ఆశ్చర్యపోతున్నారా? దేశవ్యాప్తంగా ‘కబీర్‌ సింగ్‌’కు వస్తున్న ఆదరణ, విమర్శల వల్ల ఆ చిత్ర ఒరిజినల్‌ వెర్షన్‌ ‘అర్జున్‌రెడ్డి’పై ఉత్తరాది సినీ ప్రియుల కన్ను పడింది. ఈ కారణంగా గత కొద్దిరోజలుగా ‘అర్జున్‌రెడ్డి’ ట్రైలర్‌ను వీక్షించే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మొత్తంగా 4 కోట్ల మంది ఇప్పటివరకు చూశారు.

అంతేకాకుండా నాన్‌ బాహుబలి ట్రైలర్లలో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న చిత్రంగా ఉన్న ‘వినయ విధేయ రామ’ రికార్డును ‘అర్జున్‌ రెడ్డి’ చెరిపేసింది.


ఇది చదవండి: నాని 'గ్యాంగ్​లీడర్'​కు మ్యూజిక్ స్టార్ట్

ABOUT THE AUTHOR

...view details