'భారతీయుడు-2' షూటింగ్ స్పాట్లో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో, తాను కొద్దిలో చావు నుంచి తప్పించుకున్నానని హీరో కమల్‌హాసన్ చెప్పాడు. చిత్రబృందంలోని ముగ్గురు సభ్యులు ఈ ఘటనలో మరణించారు. అయితే ప్రమాదాలు సునామీ వంటివని.. వాటికి ధనిక, పేద తేడా ఉండదని కమల్ అన్నాడు.
"మేం కొద్దిలో చావు నుంచి తప్పించుకున్నాం. ప్రమాదం జరగడానికి నాలుగు సెకన్ల ముందే దర్శకుడు శంకర్, కెమెరామెన్ అక్కడి నుంచి కదిలారు. ఆ ప్రదేశం దగ్గర్లోనే నేను, హీరోయిన్ కాజల్ నిలబడి ఉన్నాం" -కమల్‌హాసన్, కథానాయకుడు