తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా పుట్టినరోజు అసలైన బహుమతి అదే' - corona news latest news

బాలీవుడ్​ నటి భూమి పెడ్నేకర్​ తన పుట్టిన రోజును ఈ ఏడాది (జులై 18) కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోనున్నట్లు తెలిపింది. తన బర్త్​డేకి ఇచ్చే స్పెషల్​ గిఫ్ట్​ కరోనాకు వ్యాక్సిన్​ కనుగొనడమే అంటోందీ ముద్దుగుమ్మ.

COVID-19 vaccine is all that Bhumi Pednekar wish on birthday
పడ్నేకర్​కు కరోనా వ్యాక్సిన్​ను బర్త్​డే గిఫ్​ట్​గా ఇవ్వాలంటా

By

Published : Jul 18, 2020, 5:27 PM IST

బాలీవుడ్​ నటి భూమి పెడ్నేకర్​ జన్మదినం నేడు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే, తన పుట్టినరోజుకు అసలైన బహుమతి కరోనాకు వ్యాక్సిన్​ కనుగొనడమే అని అంటోందీ ముద్దుగుమ్మ.

"ఈ ఏడాది నా పుట్టిన రోజు బహుమతి ఏంటంటే.. వైరస్​ ప్రభావం పడిన ప్రజలు.. ప్రస్తుత పరిస్థితుల నుంచి బాధపడుతున్న వారందరికీ విముక్తి కలగాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అలా జరగాలంటే కరోనాకు వ్యాక్సిన్​ కనుగొనాలి."

-భూమి పెడ్నేకర్​, సినీ నటి

తన పుట్టినరోజు ప్రణాళికలను వివరిస్తూ.. "నేను ఎవరినీ కలవను. ఇంట్లో నా కుటుంబంతో కలిసి ఉంటా. ఎటువంటి స్పెషల్​ ప్రోగ్రామ్​లు లేవు. ఈ ఏడాది వేడుకలు చాలా భిన్నంగా ఉండనున్నాయి." అంటూ చెప్పుకొచ్చిందీ అమ్మడు.

లాక్​డౌన్​ ప్రభావం గురించి స్పందించిన భూమి.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి గడపడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. సినిమా షూటింగ్స్ లేకపోవడం ఓ వైపు బాధగా ఉన్నప్పటికీ.. నెమ్మదిగా వైరస్​తో నెలకొన్న పరిస్థితుల నుంచి కోలుకుంటామని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:'ఆరోపణలు నిజం కాకపోతే పద్మ శ్రీ తిరిగిచ్చేస్తా'

ABOUT THE AUTHOR

...view details